సిగ్గుందా సైకో రామ్? కేటీఆర్ పై సామ రామ్మోహన్ ఫైర్

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్ సామ రామ్మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమెల్యే బదులు అధికార కార్యక్రమాల్లో పాల్గొనడానికి సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఎవరని కేటీఆర్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్ చేసిన విమర్శలకు సామ రామ్మోహన్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

‘సిగ్గుందా సైకో రామ్?? నువ్వు కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నావా ? కుటుంబ పాలన వ్యాఖ్యలకు ముందు నువ్వు అద్దం ముందు చూస్తే.. నీ నీడ కూడా నీ మీద ఉమ్మేస్తుంది. ఏ పదవీ లేనప్పుడు మీ అయ్యకి టాబ్లెట్లు, టాయిలెట్ పేపర్లు అందించే సంతోష్ కుమార్ కు 1+1 సెక్యూరిటీ ఎవడు ఇచ్చాడు. రాజ్యసభ ఎంపీకి ఐఎస్ డబ్ల్యు ప్రోటోకాల్ కాకపోయినా 2+2 సెక్యూరిటీ ఎవడు పెట్టిండని నిలదీశారు. మీలాగా అధికారంలో ఉన్నప్పుడు కుటుంబమంతా ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా నియమించుకోలేదు.. రేవంత్ రెడ్డి తన కుటుంబంలోని వారికి పదవులు ఇవ్వలేదని గుర్తు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version