సీతా రామ ఎత్తిపోతల పథకం పంప్ 2 నుండి నీళ్లు విడుదల

-

సీతా రామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ  పంప్ హౌస్ వద్ద 25 మెగావాట్ల పంపు కోసం విజయవంతమైన తడి ట్రయల్ రన్ నిర్వహించారు.  ముఖ్యంగా తెలంగాణ  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, నీటిపారుదల అధికారులు మరియు ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు ఈ ట్రయల్ రన్.

ఇక  భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం మరియు మహబూబాబాద్ మీదుగా దాదాపు ఏడు లక్షల ఎకరాల భూమికి జీవనాధారమైన సాగునీటిని అందించడంలో ఈ  ప్రాజెక్ట్ లక్ష్యాన్ని సాధించడంలో కీలకమైన ముందడుగును సూచిస్తుంది. తాజాగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గోదావరి ఏరులై పారుతుంది. దీంతో సీతారామ  ఎత్తిపోతల పథకం  పంప్  2 నుంచి తాజాగా నీటిని వదిలారు. ఆ నీటిని చూస్తుంటే జలకళ అట్టే ఉట్టిపడినట్టుంది. చూసేందుకు చాలా ఆకర్షణీయంగా కనిపించడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version