సీఎండీ ప్రభాకర్ రాజీనామాను ఆమోదించొద్దని రేవంత్ ఆదేశం !

-

సీఎండీ ప్రభాకర్ రాజీనామాను ఆమోదించొద్దని తెలంగాణ రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పాలనలో దూకుడు పెంచారు. నేడు విద్యుత్, ఆర్టీసీ పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం కానున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత ప్రయాణంపై నేడు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

Revanth order not to accept the resignation of CMD Prabhakar

ముఖ్యంగా విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారట. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం సీరియస్ అయ్యారట. విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని అభిప్రాయపడ్డ సీఎం రేవంత్‌..ఇవాళ పూర్తి వివరాలతో రావాలని ఆదేశించారట. ఇవాళ టరేప ఉదయం విద్యుత్ పై సీఎం ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తారు. విద్యుత్ శాఖలో ఇప్పటివరకు 85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు సీఎం రేవంత్‌ కు చెప్పారు అధికారులు. దీంతో సిఎండి ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దని ఆదేశించారు రేవంత్‌. ఇవాళ్టి రివ్యూకు ప్రభాకర్ రావు ను రప్పించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version