ఆలంపూర్ కాంగ్రెస్ సభ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడారు. నీలం సంజీవరెడ్డిని కాంగ్రెస్ రాష్ట్రపతిని చేస్తే.. 100 కోట్లతో జోగులాంబను అభివృద్ధి చేస్తానని చేయలేదన్నారు. ఇవాళ ఆ గుడి పరిస్థితి ఎలాగుందో ఒక్కసారి చూడండి. నిన్ననే నడిగడ్డలో రేవంత్ రెడ్డి 3 గంటలు చాలు అన్నాడని.. ఎక్కడ అన్నాడో నిరూపించాలి. 1200 విద్యుత్ బకాయిలుంటే.. ఒక్క సంతకంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాఫీ చేశాడు. ఉచిత విద్యుత్ ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల పాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే.. నేను నామినేషన్ కూడా వేయను అని తెలిపారు. ఒక వేళ ఇయ్యకుంటే బీఆర్ఎస్ నేతలు రైతులకు క్షమాపణలు చెప్పాలని కోరారు రేవంత్ రెడ్డి.
బోయలను ఎస్టీలో చేర్చుతామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని తెలిపారు. చల్లా వెంకట్రామిరెడ్డి కల్వకుంట్ల కుటుంబం వద్ద బానిసగా మారిపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాక ముందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతు రుణం ఇచ్చి.. మాఫీ చేశారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. దళారులు అందరూ ధరణిని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తెలిపారు. ధరణీకి మించిన పోర్టల్ ని తీసుకొచ్చి మీ భూములను కాపాడుతామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.