రేవంత్ రెడ్డి మరో బిగ్ షాక్.. కీలక నేతలు రాజీనామా !

-

కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ ముసలం పెరిగింది. సీనియర్‌ నాయకులు ఆయనను టార్గెట్ చేశారు. ఇక తాజాగా కూడా తెలంగాణ కాంగ్రెస్ లో ప్రకంపనలు రేపుతోంది. ఇటీవల ప్రకటించిన జంబో కమిటీల్లో సీనియర్ నేతలుగా ఉన్న తమకు అవకాశం దక్కలేదని అసంతృప్తితో పలువురు కీలక నేతలు తమ పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నారు.

టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లకు కాకుండా అనుభవం లేని జూనియర్లకు కమిటీలలో చోటు కల్పించారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు సీనియర్ నేతలు ఇప్పటికే కమిటీల నియామకం విషయంపై అసంతృప్తితో తమ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో తాజాగా మరో ఇద్దరు నేతలు కూడా రాజీనామాల బాట పట్టారు. ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి భరత్ చౌహన్, అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పదవికి చారులత రాథోడ్ రాజీనామా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version