రేవంత్ కీలక నిర్ణయం…సునీల్ కనుగోలుకు కీలక బాధ్యతలు ?

-

Revanth Reddy key decision key responsibilities for Sunil kanugolu: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి…సునీల్ కనుగోలుకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అయ్యారట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే… అదికూడా కాంగ్రెస్‌ పార్టీ అదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారట. గులాబీ పార్టీ వాళ్ళ స్పీడ్ తట్టుకోలేకపోతున్నాం అర్జెంట్‌గా మన పార్టీ సోషల్ మీడియా టీం మార్చండి అంటూ కాంగ్రెస్‌ పార్టీ అలర్ట్‌ అయిందని సమాచారం.

Revanth Reddy key decision key responsibilities for Sunil kanugolu

ఇటీవల అసెంబ్లీ సమావేశాలు, కరెంట్ కోతలు, ఇతర అంశాల అన్నింటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ చేస్తున్న దాడితో మన ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైందని కాంగ్రెస్‌ పార్టీ గుర్తించింది. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ డామినేట్ చేసింది అనేలా నెరేటివ్ సెట్ చేయడంలో ఆ పార్టీ సోషల్ మీడియా సక్సెస్ అయిందని రేవంత్ రెడ్డి అభిప్రాయ పడుతున్నారట. దీంతో రేవంత్ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. పార్టీ సోషల్ మీడియా బాధ్యతలు తిరిగి సునీల్ కనుగోలు చేతిలో పెట్టాలని నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version