విశ్వనగరం అని గప్పాలు.. కోట్లు పెట్టి ప్రచారాలు- కానీ చినుకు పడితే చిత్తడే : రేవంత్ రెడ్డి

-

తెలంగాణలో ఎన్నికల ప్రచారం రోజురోజుకు రాజుకుంటోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో అధికార, ప్రతిపక్షాలు మాటల తూటాలు పేల్చుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రచారం మరింత తారాస్థాయికి చేరింది. ఇరు పార్టీల మధ్య వర్డ్ వార్ చాలా సీరియస్​గా నడుస్తోంది. ఓవైపు ప్రజాక్షేత్రంలో బహిరంగ సభల వేదికగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూనే.. మరోవైపు సోషల్ మీడియా ప్రచారంలోనూ జోరు చూపిస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్, కొడంగల్, కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. విశ్వనగరంగా భాగ్యనగరాన్ని మారుస్తామని చెప్పి కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ‘ఇస్తాంబుల్ అన్నారు.. చికాగో అన్నారు.. విశ్వనగరం అని గప్పాలు.. రూ.కోట్లు పెట్టి ప్రచారాలు.. కానీ.. చినుకు పడితే వణుకు.. అడుగు బయట పెడితే గల్లంతు.. కాళేశ్వరం మునగడం అయింది.. ఇగ హైదరాబాద్ మునుగుడు షురైంది. వర్షాకాలం అదే గోస.. చలికాలం కూడా అదే వరుస.. రూ. వేల కోట్ల ఖర్చు ఫలితం ఇదా? కమిషన్ల పేరుతో మొత్తం మీరే మేసేస్తే.. ఇక మార్పెక్కడిది? అందుకే మార్పు కావాలి! కాంగ్రెస్ రావాలి!’ అంటూ పోస్టులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version