తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. రేపు తిరుమల ఎస్‌ఈడీ టికెట్ల కోటా విడుదల కానున్నాయి. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు కొనసాగనున్నాయి. ఇందుకు సంబంధించి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, శ్రీవాణి దర్శనం టికెట్లు, గదులకోటాను టీటీడీ రేపు విడుదల చేయనుంది.
ఉదయం 10 గంటలకు 2.25 లక్షల ఎస్ఈడి టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. శ్రీవారి దర్శన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు, గదులకోటను సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు. కాగా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న ఒక్క రోజు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు తిరుమల శ్రీవారి భక్తులు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 58,157 మంది భక్తులు దర్శించుకున్నారు. అటు నిన్న ఒక్క రోజు 24,054 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు. అటు నిన్న ఒక్క రోజే ఏకంగా.. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.55 కోట్లుగా నమోదు అయింది.