రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండడు.. బాజీరెడ్డి గోవర్దన్ సంచలన వ్యాఖ్యలు

-

సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండే పరిస్థితి లేదని.. ప్రధానంగా ఆయనను  కాంగ్రెస్ వాళ్లే బొంద పెడతారని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.  తనకు ఓ పాత కాంగ్రెస్ మిత్రుడు ఫోన్ చేసి తాను గెలుస్తున్నట్లు చెప్పాడని..అదేవిధంగా  సీఎం రేవంత్ రెడ్డిని పాత కాంగ్రెస్ నాయకులే బొంద పెడతారని తెలిపారు.  పాత కాంగ్రెస్ నాయకులైన హన్మంతరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కత్తులు పట్టుకొని తన వెంట తిరుగుతున్నారని, ఎప్పుడు పొడుస్తరో తేలియదని అన్నాట్లు తెలిపాడు.

అలాగే సీఎం రేవంత్ రెడ్డి పేగులు మెడలో వేసుకుంటానని అంటున్నాడని, నువ్వు కసబ్ వా.. లేక మేకలు, కోళ్లు కోసేవాడివా అని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. రేవంత్ రెడ్డి చెప్పిన పనులు చేయకుండా దొంగ మాటలు చెప్పి దొంగ లాగా పారిపోతాడన,, మళ్లీ క్యాడర్ ను తీసుకొని రండి అందరం కలిసి పోదామని చెబుతాడన్నారు. పోయిన క్యాడర్ కు తాను ఒక్కటే చెప్పదలుచుకున్నానని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్లు పొయిన బీఆర్ఎస్ నాయకులను కుక్కల కంటే హీనంగా చూస్తారని గోవర్ధన్ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version