అసెంబ్లీలో కేటీఆర్ విమర్శలకు రేవంత్ రెడ్డి కౌంటర్

-

అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ విమర్శలకు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ నిజాం నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను డ్రామారావు, మిత్ర బృందం కొల్లగొట్టిందని ఆరోపించారు. తనపై ఏ ఆరోపణ ఉన్నా సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం అని సవాల్ విసిరారు. మంత్రి కేటీఆర్పై, ఈ ప్రభుత్వంపై నేను చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధంగా ఉండాలన్నారు.

నిషేధిత జాబితాలో చేర్చిన భూములను ఎన్నివేల ఎకరాలు ఆ జాబితా నుంచి తొలగించారో చెప్పాలన్నారు. అవి ఎవరెవరి పేర్ల మీద బదలాయించారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. డ్రామారావు వేల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. తోట చంద్ర శేఖర్ ఆదిత్య కన్సక్షన్ కు ధరణి పేరుతో బదలాయించుకున్నారని అన్నారు. 500 కోట్ల విలువైన ఐదేకరాల భూమి ఎంపీ కవితకు మియాపూర్ లో ఎలా వచ్చిందని ప్రశ్నించారు.

ఈ భూమిని బదిలీ చేయడానికి రెడ్యా నాయక్ ను పార్టీ మార్పించింది వారి కూతురు కవిత అని.. కూతురు భూ దాహం కోసమే రెడ్యా నాయక్ పార్టీ మారారని ఆరోపించారు. కవిత గారు… ఈ విషయంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ నీ కొడుకు చేసే భూ దందాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. దృతరాష్టుడిలా కేసీఆర్ కళ్లు మూసుకున్నారా? అంటూ మండిపడ్డారు. శాసన సభలో సభ్యుడు లేనప్పుడు పేరు ప్రస్తావించి కూడదన్న కనీస జ్ఞానం కేటీఆర్ కు లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version