రేవంత్ రివర్స్ ఎటాక్..అదిరే లాజిక్‌లతో కారుకు చెక్!

-

తెలంగాణలో టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్ లో బలం ఉన్నా సరే బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పి పోరులో వెనుకబడిపోయింది..కానీ రేవంత్ పాదయాత్రతో సీన్ మారుతూ వచ్చేస్తుంది. పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజా స్పందన వస్తుంది. జనం మద్ధతు పెరుగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యేలా ఉంది. అలాగే బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా రేవంత్ ముందుకెళుతున్నారు.

ఇదే క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డికి అక్కడ ప్రజానీకం నుంచి భారీ మద్ధతు లభిస్తుంది. భారీ వానలో కూడా రేవంత్ పాదయాత్ర సక్సెస్ గా నడుస్తోంది. ఇక ఎప్పటినుంచో కే‌టి‌ఆర్, హరీష్ రావులు..ప్రత్యర్ధి పార్టీ లైన బి‌జే‌పి, కాంగ్రెస్ పార్టీలపై ఒక సెటైర్ వేస్తుంటారు. అది కూడా బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సెటైర్ వేస్తారు. అసలు కే‌సి‌ఆర్ పొరాడి తెలంగాణ సాధించడం వల్లే బండి, రేవంత్ రెడ్డి అధ్యక్షులు అయ్యారని అంటుంటారు.

ఇక కే‌టి‌ఆర్‌కు రేవంత్ అదిరే లాజిక్ లతో కౌంటర్ వేశారు. “ అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుంటే ఈ రోజు పదవులు అనుభవిస్తున్న మీరు బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి ఉండేది. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తేనే నీ అయ్య సీఎం, నువ్వు, మీ బావ మంత్రులు, మీ చెల్లె ఎమ్మెల్సీ అయ్యింది.” అంటూ కే‌టి‌ఆర్‌కు రేవంత్ కౌంటర్ ఇచ్చారు.

అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టే..కే‌సి‌ఆర్ సి‌ఎం, కే‌టి‌ఆర్, హరీష్ మంత్రులు, సంతోష్ రాజ్యసభ, కవిత ఎమ్మెల్సీ అయిందని అదిరే కౌంటర్ ఇచ్చారు. నిజానికి ఈ లాజిక్ కరెక్ట్ అనే చెప్పాలి. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్టే..వీరందరికి పదవులు వచ్చాయనే చెప్పాలి. మరి ఇదే ఊపుని రేవంత్ రెడ్డి కొనసాగిస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version