హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రశాంతంగా వారు నిరసన ర్యాలీలు తీస్తుంటే పోలీసులు రెచ్చిపోయి మరీ వారి మీద లాఠీలు ఝలిపించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా విద్యార్థులపై పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. విద్యార్థులపై లాఠీచార్జికి సంబంధించిన వీడియోను ఆయన పోస్టు చేస్తూ.. ‘ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని తలపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సోకాల్డ్ ప్రజాపాలన. #HCU విద్యార్థులు, వారికి మద్దతుగా నిలిచిన ప్రొఫెసర్లపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.
ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని తలపిస్తున్న @revanth_anumula సోకాల్డ్ ప్రజాపాలన. #HCU విద్యార్థులు, వారికి మద్దతుగా నిలిచిన ప్రొఫెసర్లపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. #CongressFailedTelangana pic.twitter.com/jOFWoyHJ18
— Harish Rao Thanneeru (@BRSHarish) April 2, 2025