Telangana: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ పార్టీ సంచలన ఆరోపణలు చేస్తోంది. ధాన్యం కొనుగోళ్లు, సన్నబియ్యం టెండర్లలో రూ.1000 కోట్ల కుంభకోణం చేసినట్లు చెబుతోంది. బియ్యం, వడ్ల కొనుగోళ్లు, టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతివాటం ప్రదర్శించినట్లు వెల్లడిస్తోంది బీఆర్‌ఎస్ పార్టీ.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, అంగన్‌వాడీ సెంటర్లలో మధ్యాహ్న భోజనానికి అవసరమైన సన్నబియ్యాన్ని సరఫరా చేసేందుకు పౌరసరఫరాల సంస్థ టెండర్లు పిలిచారని ఆరోపణలు చేస్తోంది. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధర రూ.42.. గ్లోబల్ టెండర్ ద్వారా కిలో రూ.57కు కొనుగోలు చేసినట్లు చెబుతోంది బీఆర్ఎస్ పార్టీ. ఉన్న బియ్యం అమ్మి… సన్న బియ్యం కొని.. ఖజానాకు అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కన్నం వేశారని ఆరోపణలు చేస్తోంది. మరి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.