టైంకు జీతాలు పడకపోవడంతో.. ఉద్యోగుల సిబిల్ స్కోర్ పడిపోతుందని ఫైర్ అయ్యారు బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఊహించని షాక్ ఇచ్చింది. జులై మాసంలో 10వ తేదీ గడిచిన కూడా ఇప్పటివరకు… జీతాలు పడలేదని సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్ని సొసైటీలలో ముందుగానే వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ… తమ సొసైటీలో మాత్రం ప్రతి నెల ఇదే పరిస్థితి ఉంటోందని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఇక దీనిపై బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పోస్ట్ పెట్టారు. ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు వేస్తున్నామని వేదికలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు రేవంత్ గారు, ప్రభుత్వ ఉద్యోగులకు టైంకు జీతాలు రాక సిబిల్ స్కోర్ తో ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహించారు. ఔట్ సోర్సింగ్/కాంట్రాక్టు ఉద్యోగులకైతే గత 8 నెలలుగా జీతాలు ఇవ్వలేదు. నిరుద్యోగుల ఆవేదనను లెక్క చేయడం లేదు. చేతగాని నిరంకుశ కాంగీయుల పాలనను ప్రజలే మట్టుబెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.