తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి సంచలన వాఖ్యలు..!

-

బీజేపీ నేత‌ల‌పై ఆర్టీసీ చైర్మ‌న్ బాజీరెడ్డి గోవ‌ర్థ‌న్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ముఖ్యంగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల‌ను బీజేపీ నాయ‌కులు ఇష్టం వ‌చ్చిన‌ట్టు తిడితే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు. బీజేపీ నేత‌ల‌కు చాలా స‌మ‌యం ఇచ్చామ‌ని, చాలా ఓపిక ప‌ట్టామ‌ని ఇక‌పై ఉండ‌బోమ‌ని హెచ్చ‌రించారు. ఆర్మూర్‌లో బీజేపీ నేత‌ల‌పై జ‌రిగిన దాడిని ఆయ‌న స‌మ‌ర్థించారు.

భ‌యం లేక‌పోతే ఎవ‌రూ విన‌రు. గ‌న్నారంలో త‌ప్పించుకున్నా.. కానీ ఆర్మూర్‌లో మాత్రం త‌ప్పించుకోలేదు. బీజేపీ నాయ‌కులు ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే ఒక నుంచి ఊరుకోకండి.. ఎదురు తిర‌గండి, ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకోండి అని చెప్పారు. ఎంపీ ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే ఊరుకునేది లేద‌ని ఎద్దేవా చేశారు. ఇష్టం వ‌చ్చిన‌ట్టు టీఆర్ఎస్ నాయ‌కులే కాదు.. ప్ర‌జ‌లు కూడా వారిని చెప్పుల‌తోని కొట్టాల‌ని పేర్కొన్నారు బాజీరెడ్డి గోవ‌ర్థ‌న్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version