సన్నీ లియాన్ పాన్ కార్డుతో లోన్ ఫ్రాడ్… స‌న్నీ పాన్‌పై వేరొక‌రికి లోన్‌

-

ఈ మధ్య కాలం లో మోసాలు ఎంతలా జరుగుతున్నాయి చూస్తూనే వున్నాం. ఎంతో మంది మోసాలకు పాల్పడి దోచుకుంటున్నారు. తాజాగా నటి సన్నీ లియోన్ తన పాన్ కార్డు ని రూ. 2,000 రుణం పొందడానికి ఉపయోగించారని అంది. అయితే ఇది తన క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసిందని ఆమె అంది.

తొలగించబడిన ట్వీట్‌లో, ఎవరో నా పాన్ కార్డుని రూ. 2,000 రుణం పొందడానికి ఉపయోగించారని సెక్యూరిటీస్ తనకు సాయం చేయలేదని చెప్పింది. ఆమె తన ట్వీట్‌లో ఇండియాబుల్స్ సెక్యూరిటీస్ లిమిటెడ్ మరియు ఇండియాబుల్స్ హోమ్ లోన్స్‌ని ట్యాగ్ చేసింది.

అలానే ఆమె సమస్య పరిష్కరించబడిన తర్వాత కంపెనీకి ధన్యవాదాలు తెలిపింది. అలానే ఆమె దీన్ని వేగంగా పరిష్కరించినందుకు మరియు ఇక పై జరగకుండా చూసుకుంటారని థాంక్స్ చెప్పింది. @IVLSecurities @ibhomeloans @CIBIL_Officialకి ఆమె ట్యాగ్ చేసి థాంక్స్ చెప్పింది.

చెడ్డ సిబిల్‌తో వ్యవహరించడానికి ఎవరూ ఇష్టపడరు అని.. ఎవరికీ ఈ సమస్య రాకుండా చూసుకోవాలని అంది. అలానే గతంలో ఇలాంటి సమస్య జర్నలిస్ట్ ఆదిత్య కి వచ్చింది. అయితే ఈ తరహా మోసాలపై చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అయితే వెబ్ సైట్ ప్రకారం చూస్తే పర్సనల్ లోన్స్ ని డైరెక్ట్ గానే బ్యాంక్ అకౌంట్ లోకి వేస్తుంది. అలానే పాన్ కార్డు మరియు మరి కొన్ని డాక్యుమెంట్స్ తో ఇన్స్టంట్ గా కంపెనీ లోన్స్ ని ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version