హైదరాబాద్ లో ఆర్టీసీ మహిళ కండక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బండ్లగూలో కండక్టర్ శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది. అయితే.. కండక్టర్ శ్రీవిద్య ఆత్మహత్య సంఘటనపై కండక్టర్ శ్రీవిద్య తల్లి సంచలన విషయాలు బయటపెట్టారు. నా కూతురు పదేళ్ళుగా కండక్టర్ గా పని చేస్తుందని..నా ఇద్దరు కూతుళ్ళు ఆర్‌టిసిలోనే చేస్తున్నారన్నారు కండక్టర్ శ్రీవిద్య తల్లి.
ఇప్పుడు ఉన్న బండ్లగూడ డిపో డీఎం వేధింపులకు గురిచేస్తుందని..కలెక్షన్ రావడం లేదంటూ నా కూతురును వేధించిందని ఆగ్రహించారు. పనిష్మెంట్ డ్యూటీ అంటూ హయత్‌నగర్ టూ డిపోకు ట్రాన్స్ఫర్ చేశారు…శ్రీవిద్య కూతురు పెళ్ళి ఈ నెలలోనే ఉందని వెల్లడించింది కండక్టర్ శ్రీవిద్య తల్లి. పెళ్ళి ఉన్న సమయంలో ఇలా పనిష్మెంట్ డ్యూటీ అని తెలిస్తే పరువు పోతుందని అనుకుందని..అవమానభారం తట్టుకోలేకే నా కూతురు ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. అధికారులు వేధింపులు తాళలేక కండక్టర్ శ్రీవిద్య సూసైడ్ చేసుకుందని.. అధికారులు వేధింపులను ఖండిస్తూ లేడి కండక్టర్ల ఆందోళనకు దిగినట్లు చెప్పుకొచ్చారు.