BREAKING : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పై విచారణ వాయిదా పడింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లాయర్లు సమయం కోరడంతోనే కోర్టు వాయిదా వేసింది. ఈ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు. దీంతో చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది.
మరోవైపు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదుచేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో వాదనలు విననుంది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్‌రోహత్గీ ధర్మాసనం ముందు వాదనలు వినిపించనున్నారు.