నరేంద్ర మోడీ సంసారమే చేయలేదు.. ఆయనకు మంగళసూత్రం గురించి ఏం తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ. అమాయకురాలు బెన్ దీదీని వదిలేశాడు.. ఆమెని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకో మంగళసూత్రం విలువ తెలుస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ.
బీజేపీ అభ్యర్థి అరవింద్ పసుపు బోర్డు పేరిట రైతులను మోసం చేశారు….పసుపు సాగు విస్తీర్ణం తగ్గడం వల్లే పసుపు కు ధర పెరిగిందన్నారు. మూత పడ్డ చక్కర కర్మాగారాల పునరుద్దరణ కాంగ్రెస్ తోనే సాధ్యం అని చెప్పారు. రైతులు రుణ మాఫీకి మేము కట్టుబడి ఉన్నాం. ఆగస్టు 15 వరకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికులను ఆదుకుంటామన్నారు.