తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యారంగంలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ 20న రాష్ట్ర విద్యాదినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకేరోజు 10వేల ప్రభుత్వ స్కూళ్లలో గ్రంథాలయాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే రీడింగ్ కార్నర్లు, 1,600 స్మార్ట్ క్లాస్ లను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. కాగా, తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి.
తెలంగాణ ఎంసెట్ ఫలితాలను కాసేపటి క్రితమే… విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేశారు.ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఎంసెట్ కి అన్ని డిపార్ట్మెంట్ సహకరించాయి.. ఈ సారి గతంలో కన్నా ఎక్కువ జాగ్రత్త లు తీసుకున్నామని పేర్కొన్నారు. తక్కువ సమయంలో రిజల్ట్స్ ఇస్తున్నాం…127 సెంటర్స్ ఏర్పాటు చేసామని వెల్లడించారు. 104 తెలంగాణ 23 ఆంధ్ర లో ఏర్పాటు చేసామని.. 91,935 మంది అగ్రికల్చరల్, ఫార్మసి లో ఉత్తిర్ణత సాధించినట్లు తెలిపారు. ఇంజనీరింగ్ లో 1,92,298 మంది పరీక్ష రాయగ 1,56,879 మంది ఇంజనీరింగ్ లో ఉత్తిర్ణత సాధించినట్లు వెల్లడించారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.