సూర్యాపేట జిల్లాలో పంట పొలాల్లోకి సాగర్‌ నీరు.. కోతకు వచ్చిన వరి నీట మునక

-

ఆరుగాలం శ్రమించి పంట కోసే సమయంలో లేదా పంట కోసి అమ్ముకునే సమయంలో ప్రకృతి విపత్తులు రావడం.. పంటంతా నష్టపోవడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ప్రతి వేసవిలో రైతులకు అకాల వర్షాలు తీసుకొచ్చే నష్టాల గురించి తెలియంది కాదు. కానీ కొన్నిసార్లు అధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వాల వైఫల్యం వల్ల కూడా రైతులు నష్టపోతున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకున్న ఘటన చూస్తే అలాగే అనిపిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలోని పంట పొలాలన్నీ నీట మునిగాయి. అదేంటి వర్షాలు కూడా కురవలేదు ఇప్పుడు నీట మునగడమేంటని అనుకుంటున్నారా. ఇది వాన చేసిన పని కాదు. సాగర్ ఎస్కేప్ గేటు కొట్టుకుపోయి.. నీరంతా పంట పొలాల్లోకి చేరింది. అప్పటికీ అప్రమత్తమైన అధికారులు సాగర్ ఎడమ కాలువను బంద్ చేయించినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పంట పొలాల్లో నీరు చేరడంతో కోతకు వచ్చిన పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. బేతవోలు చెరువు నింపేందుకు జేసీబీతో షటర్ తెరిచారని.. అందుకే ఇలా జరిగిందంటూ పోలేనిగూడెం రైతులు ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version