కోకాపేట్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య…7 అంతస్తుల భవనంపై నుంచి !

-

హైదరాబాద్‌ లో మరో దారుణం చోటు చేసుకుంది. మరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కోకాపేట్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగ ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. 7 అంతస్తుల భవనం పై నుండి కిందికి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగ ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ తరునంలోనే.. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు….మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాగ ప్రభాకర్ గచ్చిబౌలి లోని ఓ కంపనీ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. అయితే… కోకాపేట్ లో హాస్టల్ గదికి వచ్చి తనువు చాలించాడు నాగ ప్రభాకర్. నాగ ప్రభాకర్ ఆత్మహత్య కు గల కారణాలను తెలుసుకుంటున్నారు పోలీసులు. పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగీ పోలీసులు. కోకాపేట్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగ ప్రభాకర్ ఆత్మహత్య ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version