ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. “దానా” తీవ్ర తుఫాన్ తీరం దాటింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ప్రకటించారు. హబాలిఖాతి నేచర్ క్యాంప్(భిత్తర్కనిక) మరియు ధమ్రాకు సమీపంలో తుపాన్ ‘దానా’ తీరం దాటిందని పేర్కొన్నారు. రాత్రి 1:30 నుంచి తెల్లవారుజాము 3:30 గంటల మధ్య తీరం దాటిందని తెలిపారు.
ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ మరో 2-3 గంటల పాటు కొనసాగుతుందన్నారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మధ్యాహ్నానం నుంచి క్రమంగా బలహీనపడుతుందని వెల్లడించారు. ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్. ఒడిశాలోని భితార్కానికా, ధమ్రా ప్రాంతాల మధ్య అర్ధరాత్రి 1.30 నుంచి 3.30 గంటల మధ్య తీరం దాటింది దానా తీవ్ర తుఫాన్.. తీరాన్ని తాకే సమయంలో గంటకు 110 కిలో మీటర్ల వేగంతో భీకర గాలులు వీచే ఛాన్స్ ఉన్నాయట.. తీరప్రాంత జిల్లాలైన భద్రక్, జగత్సింగ్‌పూర్, బాలాసోర్‌లో భారీ వర్షాలు ఉంటాయట.