మీడియాలో చక్కర్లు కొడుతున్న 9 మంది కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ !

-

తెలంగాణ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి వలసలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక త్వరలో మరో నలుగురైదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. గులాబీ పార్టీ నుంచి చేరిన వారిలో ఆర్థికంగా బలంగా ఉన్న వారిని లోక్‌సభ బరిలో నిలపాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది.

Second list of 9 people doing the rounds in the media

గ్రేటర్‌ పరిధిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు సీట్లనే కాంగ్రెస్‌ గెలవగా లోక్సభ ఎన్నికల్లో మాత్రం సిటీలోని నాలుగు స్థానాలను గెలవాలని సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం పెట్టుకున్నారు.అయితే ఈ తరుణంలోనే 9 మంది పేరుతో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

మెదక్ – నీలం మధు
హైదరాబాద్ – షానావాజ్
సికింద్రాబాద్ – దానం నాగేందర్
మల్కాజ్గిరి – సునీత మహేందర్ రెడ్డి
చేవెళ్ల – రంజిత్ రెడ్డి
భువనగిరి – పైళ్ల శేఖర్ రెడ్డి
అదిలాబాద్- డా.సుమలత
వరంగల్ – పసునూరి దయాకర్
పెద్దపల్లి – గడ్డం వంశి

Read more RELATED
Recommended to you

Exit mobile version