అసెంబ్లీ నుంచి అలిగి వెళ్లిపోయిన సీతక్క !

-

అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే సీతక్క వెళ్లిపోయారు. అసెంబ్లీలో రేవంత్‌ రెడ్డి ప్రస్తావన రావడంతో..అగిలి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే సీతక్క వెళ్లిపోయారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఏం జరుగుతుందో అర్దం కావడం లేదు..సభలోకి వచ్చిన తర్వాత కూడా బిజినెస్ గురించి చెప్పడం లేదని ఆగ్రహించారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యే లకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు….జీరో అవర్ లో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఫైర్‌ అయ్యారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే గా చాలా మంది తమ సమస్యలు అసెంబ్లీ లో మాట్లాడాలని మాకు చెప్తున్నారు… మాకు అవకాశం ఇవ్వకపోతే మేము ఎలా మాట్లాడేదని.. సభలో అధికార పార్టీ బుల్డోజ్ చేస్తుందని మండిపడ్డారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే లు ఎంత సేపు మాట్లాడినా మైక్ కట్ చేయరు..మాకు ఓక నిమిషం మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సభలో అధికార పార్టీ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారు…మిషన్ భగీరథ నీళ్లు ఇస్తే..ప్రతీ ఊళ్ళో వాటర్ ప్లాంట్ లు ఎందుకు పెట్టుకుంటున్నారని ఆగ్రహించారు.అసెంబ్లీ లో లేని రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు…ఎన్నికల ప్రచారం కోసం అధికార పార్టీ సభను వాడుకుంటుందని ఆగ్రహించారు సీతక్క.

Read more RELATED
Recommended to you

Exit mobile version