తెలంగాణలో జనవరి 26, 2025న సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కోడంగల్ లోని కోస్గీ మండలం చంద్రవంచలో రేవంత్ రెడ్డి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు వంటి 4 సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు కుటుంబ పాలన సాగిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ అభివృద్ధి పట్టించుకోలేదని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సవాల్ విసిరారు. “కురుమూర్తి గుడికి తడి బట్టలతో పోదామా? మహబూబ్ నగర్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పట్టించుకోలేదని అబద్ధాలు చెబుతున్నారు రేవంత్ రెడ్డి. తడి బట్టలతో పాలమూరు మహిమన్విత కురుమూర్తి స్వామి గుడికి పోదాం వస్తావా? ఎవరు పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారో ప్రమాణం చేద్దాం.నేను రెడీ, నువ్వు వస్తావా రేవంత్ రెడ్డి” అంటూ సవాల్ విసిరారు హరీశ్ రావు.
కురుమూర్తి గుడికి తడి బట్టలతో పోదామా?
రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్
మహబూబ్ నగర్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పట్టించుకోలేదని అబద్ధాలు చెప్తున్న రేవంత్ రెడ్డి..
తడి బట్టలతో పాలమూరు మహిమన్విత కురుమూర్తి స్వామి గుడికి పోదాం వస్తావా?
ఎవరు పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారో… pic.twitter.com/yOiqV2oOWp
— Telugu Scribe (@TeluguScribe) January 26, 2025