ఎల్&టీ సీఎఫ్ఓ శంకర్ రమణ్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ఫ్రీ బస్సు పథకం వల్ల ఆర్టీసీ దివాలా తీస్తుందన్నారు ఎల్&టీ సీఎఫ్ఓ శంకర్ రమణ్. ఫ్రీ బస్సు వల్ల మహిళలు అంత బస్సులో ప్రయాణిస్తున్నారు.. బస్సుల సంఖ్య పెంచక పోవటం వల్ల బస్సులో వెళ్ళవలిసిన పురుషులు అందరూ మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు.
దీని వల్ల మెట్రో ప్రయాణం ఆసక్తికరంగా లేదని వెల్లడించారు ఎల్&టీ సీఎఫ్ఓ శంకర్ రమణ్. బస్సులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మెయింటేనెన్స్ చేయాల్సి వస్తుంది.. ఇలా ఫ్రీగా ప్రయాణిస్తున్నప్పుడు బస్సుల మెయింటేనెన్స్ కు డబ్బులు ఎక్కడ నుండి తీసుకు వస్తారన్నారు. రాజకీయ పార్టీ హామీల కోసం పెట్టిన ఈ స్కీం తెలంగాణ రవాణా సంస్థని అప్పుల పాలు చేస్తుందని వివరించారు ఎల్&టీ సీఎఫ్ఓ శంకర్ రమణ్.