ఎన్నికలు తరముకు వస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్యకు క్షమాపణలు చెప్పారు పవన్ కళ్యాణ్. విదేశీ మహిళ అయిన తన భార్యకు రాజకీయాలు తెలియవని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పిఠాపురం రోడ్డు షో లో మాట్లాడుతూ… నేను ధర్మం కోసం నిలబడితే చివరకు నా భార్యను కూడా తిట్టారని వైసీపీపై మండిపడ్డారు పవన్ కళ్యాణ్.
భారత రాజకీయాలు అర్థం కావని… అసలు ఎందుకు ఇంట్లో వాళ్ళని తిడతారు అని అడిగిందని… తన భార్య వ్యాఖ్యలను చెప్పాడు. తన భార్య చాలా ఇబ్బంది పడిందని… ఆమెకు క్షమాపణలు చెప్పానని పవన్ కళ్యాణ్ తాజాగా వెల్లడించారు. ఐదు కోట్ల మంది ప్రజల కోసం మన కుటుంబం బలయితే పర్వాలేదు అని ఒప్పుకుందాం అని ఆమెతో అన్నాను అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.