కేటీఆర్ పై 10 ప్రశ్నలతో వైఎస్ షర్మిలవిరుచుకుపడ్డారు.కేటీఆర్ గారు… కాళేశ్వరం ప్రాజెక్టు మీద విదేశాలకు నేర్పే పాఠాలు అంటే ఇవేనా జెర క్లారిటీ ఇవ్వండి అంటూ వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.38,500 కోట్ల ప్రాజెక్ట్ ను రూ.1.20 లక్షల కోట్లకు ఎలా పెంచాలి ?ఇందులో రూ.70 వేల కోట్ల కమీషన్లు ఎలా తినాలి? అడిగినన్ని కమీషన్లు ఇచ్చే “మెగా ” మోసం చేసే కంపెనీలకు ఎలా కాంట్రాక్ట్ ఇవ్వాలి? అని ప్రశ్నించారు.
18 లక్షల ఎకరాలకు నీళ్లు అని చెప్పి లక్ష ఎకరాలకే ఎలా ఇవ్వాలి?ఇంజనీర్లను పక్కన పెట్టి మనమే ఎలా ఇంజనీర్లు అవ్వాలి..పాత ఆయకట్టును కొత్త ఆయకట్టుగా ఎలా కనికట్టు చేయాలి? అన్నారు. ప్రాజెక్ట్ కట్టిన మూడేండ్లకే ఎలా మునిగిపోవాలి?ప్రాజెక్ట్ మునిగింది అని మళ్లీ రిపేర్ల పేరుతో ఎలా దోచుకుతినాలి…ఎవరైనా ప్రశ్నిస్తే అడ్డం పొడుగు మాటలు ఎలా చెప్పాలి?చూద్దాం అని పోతే పోలీసులను పెట్టి ఎలా ఆపాలి?విదేశాలు నేర్చుకునే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తే ఈ దేశమే నేర్చుకుంటుంది కదా చిన్న దొర గారు! అంటూ ఫైర్ అయ్యారు షర్మిల.