సలహాలు తీసుకోనోడికి సలహాదారులు ఎందుకో? – వైఎస్‌ షర్మిల

-

చెవిటోని ముందు శంఖం ఊదినట్లు.. సలహాలు తీసుకోనోడికి సలహాదారులు ఎందుకో? అని ప్రశ్నించారు వైఎస్‌ షర్మిల. నియంత నిర్ణయాలతో తెలంగాణను భ్రష్టు పట్టించాడు కేసీఆర్. ఒంటెద్దు పోకడతో తెలంగాణను సర్వనాశనం చేశాడు కేసీఆర్. ప్రజల గోస వినే కమిషన్లకు ఆఫీసర్లు లేరు కానీ దొరకు దోచిపెట్టే సలహాదారులను పక్కనచేర్చుకున్నాడని నిప్పులు చెరిగారు.

తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు కానీ పక్కరాష్ట్రాల మందికి లక్షలు జీతమిచ్చి మేపుతున్నాడు. తెలంగాణ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి పని చేస్తున్నారు. వీళ్ళురుణమాఫీ అమలు చేయమని సలహా ఇచ్చేవాళ్లా? లక్షా 91వేల ఉద్యోగాలు భర్తీ చేయమని సలహా ఇచ్చేవాళ్లా ? అని నిలదీశారు షర్మిల. పేదలకు ఇండ్లు కట్టి ఇవ్వమని సలహా ఇచ్చేవాళ్లా? రైతుబీమా అమలు చేయమని సలహా ఇచ్చేవాళ్లా? పోడు పట్టాలు, నిరుద్యోగ భృతి ఇవ్వమని సలహా ఇచ్చేవాళ్లా? ఇచ్చేవాళ్లు అయితే వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదు? సమాధానం చెప్పండి కేసీఆర్ ? అని ఆగ్రహించారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version