తెలంగాణలో ఒక్కో రైతుపై లక్షన్నర అప్పు – షర్మిల

-

తెలంగాణలో ఒక్కో రైతుపై లక్షన్నర అప్పు ఉందని అర్పించారు వైయస్ షర్మిల. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటే ఏంటో జర చెప్పండి BRS కేసీఆర్ గారు? దేశంలోనే రాష్ట్రాన్ని అప్పుల్లో అగ్రస్థానంలో పెట్టడం రైతుకు భరోసానా? అని ప్రశ్నించారు.ఒక్కో రైతు నెత్తి మీద లక్షన్నర అప్పు పెట్టడం అభివృద్ధా? అని నిలదీశారు.

 

37లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టడం మీ BRS నినాదమా..? 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమే కిసాన్ సర్కార్ అంటారా?సబ్సిడీ పథకాలను బంద్ పెడితే రైతు సంక్షేమ ప్రభుత్వమా? అని ప్రశ్నించారు షర్మిల.

 

 

ఒక చేత్తో రైతుబంధు ఇచ్చి.. మరో చేత్తో వెనక్కి తీసుకోవడం రైతును ఆదుకున్నట్లా?ఉచిత ఎరువులు అని చెప్పి పంగనామాలు పెట్టడం,బ్యాంకుల ఎదుట రైతులను మోసగాళ్లను చేయడం. పంట నష్టపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం.. ఇదేనా “అబ్ కీ బార్ కిసాన్” సర్కార్! మీది అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ కాదు. “ఆప్ కి బర్బాత్ సర్కార్”. కన్న తల్లికి అన్నం పెట్టలేనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నాడట. ఈ బంగారు గాజుల లెక్కనే ఉన్నది దొర కేసీఆర్ తీరు..! అని ఫైర్ అయ్యారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version