కాంగ్రెస్ పార్టీలో ఖాయమైన షర్మిల చేరిక..?

-

వైఎస్ షర్మిల వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు భుజానికెత్తుకోబోతున్నట్లుగా గత రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల  వైఎస్ఆర్  కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు కూడా ఇటీవల ఈ విషయంపై స్పందించారు. షర్మిలను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఆయన అన్నారు. షర్మిల చేరికతో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం వస్తుందని.. పార్టీ మళ్లీ బలోపేతం అవుతుందని కేవీపీ అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా చతికిలపడ్డ హస్తం పార్టీకి షర్మిల వల్ల లాభమా… నష్టమా అన్న విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలోనే  కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక ఖాయం అయింది. రేపు లేదా ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్నారు షర్మిల.షర్మిలకు 2 బంపర్ ఆఫర్లు ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. ఖమ్మం లోక్ సభ సీటుతో పాటు.. ప్రియాంక గాంధీతో సమానంగా AICC జనరల్ సెక్రటరీ పోస్ట్ కూడా ఇవ్వనున్నారు. పాలేరు సీట్ ఆశించిన షర్మిల కుదరదన్నది అధిష్టానం.

Read more RELATED
Recommended to you

Exit mobile version