కేసీఆర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కి షాక్..!

-

మాజీ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. రెండు నెలలుగా తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగిన తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. గత నెల 12న 11 మంది సభ్యులతో కలిసి కలెక్టర్ కి అవిశ్వాసం నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా బీఆర్ఎస్ బడా నాయకులు రంగంలోకి దిగి ఒక కౌన్సిలర్ ని రాజకీయ ఒత్తిళ్లకి గురిచేసి లోబరుచుకున్న బీఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ ఇచ్చింది.

10 మంది కౌన్సిలర్లతో పాటు ఒకరు ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఎమ్మెల్సీ రాఘోత్తం రెడ్డితో కలిసి మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్పై అవిశ్వాసంకు మద్దతుగా మొత్తం 11 మంది సభ్యులు చేతులెత్తి ఓటు వేశారు. దీంతో మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం నెగ్గింది. బుధవారం నాడు కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో జయచంద్ర రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయగా కోరంకి సరిపడా సభ్యులు హాజరు అయి అవిశ్వాసానికి చేతులు లేపడంతో అవిశ్వాసం నెగ్గినట్టుగా ధృవీకరించారు.

ప్రస్తుత చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గడంతో ఇప్పటివరకు వైస్ చైర్మన్ గా వ్యవహారిస్తున్న నందాల శ్రీనివాస్ ఇంచార్జ్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. నూతన చైర్మన్ ఎన్నిక తేదీలను త్వరలో వెల్లడిస్తామని ఆర్డీఓ జయచంద్ర రెడ్డి తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version