మంత్రి పొంగులేటికి షాక్.. రాఘవ నిర్మాణ సంస్థకు నోటీసులు

-

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి  ఏపీ ప్రభుత్వం ఝలక్ ఇచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా  పొంగులేటికి సంబంధించిన రాఘవ నిర్మాణ సంస్థకు నోటీసులు ఇచ్చారు.  విశాఖలో భూగర్భ విద్యుత్ లైన్ల పనులు మొదలు పెట్టని సంస్థ పై చర్యలు తప్పవు అంటున్నారు అధికారులు.  ఏపీలోని ఈపీడీసీఎల్ పరిధిలో భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.1,194 కోట్లతో పిలిచిన టెండరును దక్కించుకున్న తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి చెందిన రాఘవ నిర్మాణ సంస్థకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వెంటనే పనులు మొదలుపెట్టకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

శ్రీనివాసరెడ్డి మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఏడాది కిందట కాంట్రాక్టు దక్కించుకుని ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. ప్రతి నెలా డిస్కం అధికారులు నోటీసులు పంపుతున్నా స్పందించడం లేదు. మరో నెలలో పనులు ప్రారంభించకపోతే చర్యలు తప్పవని నోటీసులో ఈపీడీసీఎల్ హెచ్చరించింది. విద్యుత్ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం ఆర్డీఎస్ఎస్ లో భాగంగా ప్రతిపాదించిన పనులను నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయాలి. లేకపోతే కేంద్రం నుంచి వచ్చే గ్రాంటు నిలిచిపోతుంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఒకింత ఘాటుగా అధికారులు నోటీసులో హెచ్చరించినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version