బీఆర్ఎస్ లో చేరికపై ఆ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించారు. తాను బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. అలాంటి వార్తలను నమ్మవద్దని సూచించారు. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడమంటే.. ప్రాణత్యాగం చేయడమే అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే భద్రాచలం అభివృద్ధి చెందుతుందని భద్రాచలం అభివృద్ధి కొరకే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వచ్చినట్టు తెలిపారు. 

ముఖ్యంగా భద్రాచలం పట్టణ ప్రజలందరూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను అస్సలు నమ్మొద్దని చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీవెనలతో.. అదేవిధంగా   తన గురువు మంత్రి పొంగులేటి ఆశీస్సులతో, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులతో భద్రాచలం అభివృద్ధి చెందుతుందని నమ్మకంతో పార్టీ మారినట్టు తెలిపారు. అదే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని.. తాను పార్టీ మారనని స్పష్టం చేశారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version