కళ్యాణ లక్ష్మీ పథకంలో భాగంగా రూ.1,01,116 చెక్కుతో పాటు ఇస్తామన్న తులం బంగారం ఏమైంది అని ప్రశ్నించారు కేటీఆర్. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ముఖ్యంగా మహిళలను మోసం చేసిందనే చెప్పాలి. నెలకు రూ.2,500, కళ్యాణలక్ష్మీ తులం బంగారం గురించి ప్రస్తావించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందని ఆర్బీఐ చెబుతోంది.
అయితే గత ప్రభుత్వం అప్పులు చేసిందని మాపై నిందలు మోపుతున్నారు. అప్పు గురించి చెప్పి.. గత ప్రభుత్వం ఆస్తుల గురించి ఎందుకు చెప్పరు అని ప్రశ్నించారు. ద్రవ్య వినిమయ బిల్లు పై విస్తృత చర్చ జరగాలి. స్కిల్స్ యూనివర్సిటీ బిల్లుకు బీఆర్ఎస్ తప్పకుండా మద్దతు ఇస్తుంది. ప్రశ్నిస్తే.. దాడులు, ఆటో అన్నల ఆత్మహత్యలు. మూడు తిట్లు, ఆరు అబద్దాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓట్లకు ముందు అభయహస్తం.. ఓట్ల తరువాత శూన్య హస్తం అని సెటైర్లు వేశారు.