SLBC టన్నెల్ ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రంగంలోకి ఆపరేషన్ మార్కోస్ వస్తోంది. SLBC టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం ఆపరేషన్ మార్కోస్ రంగంలోకి దిగింది. మరికాసేపట్లో టన్నెల్ వద్దకు ఇండియన్ మెరెయిన్ కమాండో ఫోర్స్ దిగనుంది. నేల, నీరు, ఆకాశం లో రెస్క్యూ లు చేసేది మార్కోస్. SDRF, NDRF, ఇంజనీర్ల తో కలిసి రెస్క్యూ లో పాల్గొననుంది మార్కో స్.

అయితే… SLBC టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం ఆపరేషన్ మార్కోస్ రంగంలోకి దిగడంతో.. కార్మికులు బయటకు వస్తారని అందరూ అనుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా…నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలోని SLBC టన్నెల్ వద్ద ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు సొరంగంలోనే చిక్కుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే. గత నాలుగు రోజులుగా కార్మికులు సొరంగంలోనే ఉండిపోయారు. వారు బతికి ఉన్నారా..? లేదా జరగరానిది ఏమైనా జరిగిందా..? అనే విషయం కూడా ఇంతవరకు తెలియరాలేదు.