ప్రజలు తీర్పు ఇచ్చారు.. ఎవరి బాధ్యతలు వారికి ప్రజలు అప్పగించారు అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయాలి. అయితే గవర్నర్ ప్రసంగం లో కొన్ని కామెంట్స్ సరిగా లేవు అన్నారు. ముఖ్యంగా BRS ప్రభుత్వం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇస్తుందా అని అడుగుతున్నాను.
ప్రధానంగా మైనార్టీలు, బీసీలకు ప్రత్యేక సభ్ ప్లాన్ కావాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ కులగణన చేస్తామని హామీ ఇచ్చింది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ప్రయత్నం ను స్వాగతిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి పాలకులుగా చాలా అనుభవం ఉంది. వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేస్తారు అనుకుంటాను. 3 లక్షల 10 వేల కోట్ల రూపాయలు కావాలి. కాంగ్రెస్ ఇచ్చిన ముఖ్యమైన హామీల అమలుకు కాంగ్రెస్ అన్ని చూసే మ్యానిఫెస్టో తతయారు చేశారు అనుకుంటాను అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దన్ తెలిపారు.