అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ ఓంబిర్లా అనుమతి

-

మణిపూర్ అల్లర్లపై పార్లమెంట్ లో విపక్ష నేతల ఆందోళన కొనసాగుతోంది. మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నేడు నోటీసులు ఇచ్చాయి. బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అవిశ్వాస అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇక విపక్షాల కూటమి ‘ఇండియా’ తరపున కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయల్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఫైల్ చేశారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి లోక్సభ స్పీకర్ ఓంబిర్లా అనుమతి ఇచ్చారు.

చర్చ సమయాన్ని కాసేపట్లో చెబుతామని వెల్లడించగా.. వెంటనే చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు నినాదాలు చేస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పటికీ అది వీగిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. లోక్సభలో బలాబలాలు చూస్తే.. ప్రతిపక్ష కూటమికి కేవలం 140 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. అదే సమయంలో అధికార ఎన్డీఏ కూటమికి 330 మంది సభ్యుల మద్దతు ఉంది. మిగతా 60 మంది సభ్యులు ఏ కూటమిలోనూ లేరు. దీంతో అవిశ్వాస తీర్మానం నిలబడదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version