గంగారెడ్డి హత్య పై మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు

-

గంగారెడ్డి హత్య పై మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ గంగారెడ్డి కుటుంబాన్ని మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… గంగారెడ్డి హత్య వెనుక ఏదైనా రాజకీయ కారణం ఉందా ? కాంగ్రెస్ నేతలు, శ్రేణులకు అనుమానాలు రావడం తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ డీజీపీ, ఎస్పీ లతో మాట్లాడారన్నారు.

sridhar babu

బాలికలకు ఏర్పాటు చేసిన టాయిలెన్స్ గోడలకు నీరు పట్టేందుకు వెళ్లిన గంగారెడ్డి హత్యకు గురి కావడం బాధాకరం అని చెప్పారు. హత్య వెనుక ఉన్న కారణాలేంటి అనే అంశాలపై ప్రభుత్వం విచారణ చేయిస్తోందని చెప్పారు. ఎలాంటి సందేహాలకు తావు లేకుండా విచారణ జరగాలని కోరుతున్నామని వెల్లడించారు. ఎందుకు హత్య చేశారో అనేది ఇప్పటికి తెలియడం లేదా ? అని ప్రశ్నించారు. మృతుడి కుటుంబం ఆవేదన వ్యక్తం.. పోలీసు యంత్రాంగం పై పలు అనుమానాలు ఉన్నాయని బాంబు పేల్చారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనో వేదనకు గురైయ్యారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version