కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి : కేంద్రమంత్రి బండి సంజయ్

-

మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకు పంపించిన పరువునష్టం నోటీసులపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. తాజాగా కేటీఆర్‌ లీగల్‌ నోటీసు స్పందిస్తూ బండి సంజయ్ కౌంటర్ నోటీసులు పంపారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని మరోసారి స్పష్టం చేశారు. పొలిటికల్ విమర్శలపై తనకు నోటీసులు ఇవ్వడాన్ని కేంద్రమంత్రి తప్పుబట్టారు.

లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. తక్షణమే తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలను వెనక్కి తీసుకుని కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిరాధారమైన ఆరోపణలకు ఖచ్చితమైన రుజువు లేకుండా, దురుద్దేశపూర్వకంగా తన క్లయింట్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారని బండి సంజయ్ తరఫు న్యాయవాది మంగళవారం కౌంటర్ దాఖలు చేశారు. కాగా, కేటీఆర్‌కు డ్రగ్స్ వ్యవహారంలో సంబంధాలున్నాయని బండి ఆరోపించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version