శ్రీశైలం గేట్లు తెరుచుకున్నాయి.. నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నాయి. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు ఓపెన్ చేశారు సీఎం చంద్రబాబు. 25 ఏళ్ల తర్వాత జులై మొదటి వారంలోనే తెరుచుకున్నాయి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు.

ఇక అటు ఎట్టకేలకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు వదిలారు తెలంగాణ మంత్రి, ఎమ్మెల్యేలు. నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయని, లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లను వదిలి కాలువలను నింపాలని వేడుకున్నారు రైతులు. దింతో రైతుల తరపున ప్రభుత్వంపై పోరాడారు బీఆర్ఎస్ నాయకులు. ఇక ఎట్టకేలకు నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లను వదిలారు మంత్రి జూపల్లి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. నీళ్ళు ఎప్పుడూ వదలాలో తమకు తెలుసని బుకాయించారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
తెరుచుకున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు
రైతులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి 4 గేట్లను ఎత్తి నీటిని నాగార్జున సాగర్ జలాశయానికి విడుదల చేసిన ఏపీ సీఎం చంద్రబాబు pic.twitter.com/BN1MvlH4eE
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2025