పోలీసుల సంక్షేమం కోసమే స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సోసైటీ : డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీసుల సంక్షేమం కోసమే తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్పేర్ సోసైటీని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశార‌ని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి అన్నారు. ఈ సోసైటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ‌లో ఉన్న దాదాపు లక్షకు పైగా అధికారులు, సిబ్బందికి మేలు జ‌రుగుతుంద‌ని అన్నారు. ఈ సోసైటీ ద్వారా పోలీస్ అధికారి పదవీ విరమణలోగా ఒక ఇల్లు లేదా ఫ్లాట్ ను ఉండేలా ఆర్థిక సాయం అందుతుంది. కాగ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి.. నేడీ పోలీస్ క‌మీషన‌ర్లు, ఎస్పీల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

రాష్ట్రంలో పోలీసుల‌కు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నారని అన్నారు. తెలంగాణా స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటుకు అనుమతించడమే కాకుండా ఆదాయం పన్ను మినహాయింపు వ‌ర్తించేలా చేశారని అన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆరోగ్య భద్రతా మాదిరిగానే పోలీసులకు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించాలని తాను సీఎం ను కోరిన‌ట్టు తెలిపారు. అలాగే పోలీస్ శాఖకు ఉన్న ఖాళీ స్థలాల్లో పెట్రోల్ పంపులు, ఫంక్షన్ హాళ్ల నిర్మించడానికి సీఎం అనుమ‌తి కూడా ఇచ్చార‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version