ఇక నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు ఎస్సీ సంఘాల నాయకులు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం మీ పిల్లలకు కోచింగ్ ఇప్పించాలని ఎస్సీ సంఘాల నేతలకు సూచించారు. ఎస్సీ కులాల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం. పదేళ్లుగా మీ సమస్యలు పరిష్కారం కాలేదని.. ఎవ్వరికీ అన్యాయం జరుగకుండా ఎస్సీ వర్గీకరణ చేస్తున్నామని తెలిపారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చేసిన చేసిన తరువాత నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని.. ఇక నుంచి నోటిఫికేషన్లు వస్తాయని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ చేయలేదన్నారు.” నేను జెడ్పీటీసీగా ఉన్నప్పటి నుంచి మాదిగొల్ల పిల్లలు నా కోసం తిరిగి ప్రచారం చేసేవాళ్ళు. మా పొలాల్లో ఏం పనులు ఉన్నా మాదిగోల్లె వస్తారు.. పొలాల దగ్గర మా రెడ్లకు, మాదిగోళ్లకు ఉన్న సంబంధం అలాంటిది” అని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.