తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు, రేపు ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరగనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రానికి వడగాల్పుల ముప్పు పొంచి ఉందంది.
బుధవారం కొన్ని జిల్లాల్లో ఈ వడగాల్పుల తీవ్రత అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కాగా సోమవారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడులో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
ఎండల ప్రభావం, పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల ప్రభావం… గ్రేటర్ హైదరాబాద్లోని సిటీ ఆర్టీసీ బస్సులపై పడింది. ఎండల కారణంగా ప్రయాణికులు మధ్యాహ్నం తక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నారని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. దీంతో గ్రేటర్‌లో సిటీ బస్సులను తగ్గించాలని నిర్ణయించినట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.