పోలీస్ స్టేషన్​లో జడ్పీటీసీ భర్త డ్యాన్స్.. ఎస్సై, హెడ్​కానిస్టేబుల్​పై చర్యలు

-

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ పోలీస్ స్టేషన్లో జడ్పీటీసీ భర్త శ్రీనివాస్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో కాస్త పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఠాణా ఎస్సై కె.ప్రసాద్ను వీఆర్‌కు అటాచ్‌ చేస్తూ ఎస్పీ కిరణ్ ఖరే ఉత్తర్వులు జారీ చేయగా హెడ్ కానిస్టేబుల్ ఎస్.శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు.

పోలీస్ స్టేషన్లో ఓ రాజకీయ నాయకుడు ఇలా వ్యవహరించడంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన డ్యాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విసృత్తంగా ప్రచారం అయ్యింది. ప్రజలు తమ బాధలను చెప్పుకోడానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తుంటే వాళ్ల బాధలు పట్టించుకోని పోలీసులు ఇలాంటి నేతల ప్రవర్తనను కూడా చూసీ చూడకుండా వదిలేశారని మండిపడ్డారు. కేసులతో హడావుడిగా ఉండాల్సిన పోలీస్ స్టేషన్ డ్యాన్స్ క్లబ్గా మారిందంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

అయితే ఈ ఘటనపై స్పందించిన జడ్పీటీసీ భర్త శ్రీనివాస్ ఆరోగ్యకరంగా ఉండానికి మార్నింగ్ వాక్లో ఇలా డ్యాన్స్ చేస్తే ఆరోగ్యానికి మంచిదని తెలియజేయడానికే అలా చేశానని అన్నారు. పోలీస్ సిబ్బందిని ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో చేశానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version