ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ గవాయ్ ధర్మాసనం.. ఈ కేసు తీర్పును రిజర్వ్ చేసింది. 8 వారాల్లోగా తీర్పును ఇవ్వాలని సుప్రీంకోర్టును న్యాయవాది ఆర్యమ సుందరం కోరారు.
ఇది ఇలా ఉండగా గులాబీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత… ఆ పార్టీ తరఫున గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు… కండువా మార్చేశారు. గులాబీ గూటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు 10 మంది ఎమ్మెల్యేలు. మొదటగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా.. చివరగా పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వీళ్ళ అందరిపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది గులాబీ పార్టీ.