కంచ గచ్చిబౌలి భూ వ్యవహారం హాట్ టాపిక్ అయిన వేళ .. హెచ్ సీయూ 400 ఎకరాల భూమి విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోని ఎంపీలు బుధవారం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిసి వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే గురువారం సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ రాశారు. ఏదైతే భూమిని ప్రభుత్వం అమ్మాలను కుంటున్నదో అందులో 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం పర్యావరణానికి విఘాతం కలిగించేలా వ్యవహరించరాదని లేఖలో ప్రస్తావించారు. వివాదాస్పద 400 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం అధికారులతో ఎలాంటి సర్వే చేయలేదని..అలాంటప్పుడు సరిహద్దులను ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు.పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు ప్రత్యామ్నాయంగా మరోచోట స్థలాన్ని కేటాయించాలని ధర్మేంద్ర ప్రధాన్ లేఖలో వెల్లడించారు.