సీఎం కేసీఆర్ కు మాజీ ఎంపీ… సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి లేఖ రాశారు. దేశంలోనే తొలిసారిగా డా.అంబేద్కర్ పేరిట సచివాలయం ఏర్పాటు చేసినందుకు మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని.. కులాంతర వివాహం చేసుకున్న జంటకు ఒక లక్ష రూపాయలు మరియు జీవిత భాగస్వాములలో ఒకరు దళితుడైతే రెండు లక్షల రూపాయలు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, వారికి ఉద్యోగాలలో 1% రిజర్వేషన్ కల్పించాలని నేను ప్రతిపాదిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.
తమిళనాడులో లాగా కూర్చునే హక్కు చట్టం తీసుకురావాలని మీకు నా సూచన అని.. ట్రాఫిక్ పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ, హాస్పిటల్ సిబ్బంది, ప్రభుత్వ కార్యాలయాల్లోని నాలుగో తరగతి ఉద్యోగులు, షాపుల్లో సేల్స్ సిబ్బంది, లిఫ్ట్ సిబ్బంది, డ్రైవర్లు ఇలా లక్షలాది మంది దాదాపు పది నుంచి పన్నెండు గంటలపాటు నిలుచుంటున్నారని వివరించారు. ఎక్కువ గంటలు నిలబడడం వల్ల కాళ్ల నుంచి గుండెకు రక్తప్రసరణ తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారని.. ఇది గుండెపోటులు, పక్షవాతం స్ట్రోక్‌లు మొదలైన వాటికి కారణం కావచ్చు ’’కూర్చుని హక్కు’’ అనేది మానవ హక్కు మరియు ప్రతి ఒక్కరి జీవితానికి గౌరవాన్ని తెస్తుంది. దయచేసి మానవతా కోణం నుండి ఆలోచించండని కోరారు. డాక్టర్ అంబేద్కర్ రాసిన కొన్ని పుస్తకాలు ఇప్పటికే తెలుగులోకి అనువదించబడ్డాయి. అన్ని పుస్తకాలను అనువదించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వివరించారు సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి.