స్వేచ్ఛ తండ్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. పూర్ణచందర్ చాలా దుర్మార్గుడు, అమ్మాయిల పిచ్చోడు అన్నారు స్వేచ్ఛ తండ్రి. ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు…. నా మనవరాలిని సైతం వేధించాడని బాంబు పేల్చాడు.

తల్లి స్వేచ్ఛతో కూడా చెప్పుకోలేకపోయిందని వివరించారు స్వేచ్ఛ తండ్రి. ఇది ఇలా ఉండగా యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పోలీసుల ముందు పూర్ణ చందర్ లొంగి పోయాడు. నిన్న రాత్రి 11 గంటలకు అడ్వకేట్ సమక్షంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు పూర్ణచందర్. స్వేచ్ఛ ఆత్మహత్యకి పూర్ణచందర్ కారణమంటూ చిక్కడపల్లి పోలీసులకు స్వేచ్ఛ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దింతో పూర్ణచందర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఈ తరుణంలోనే యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పోలీసుల ముందు పూర్ణ చందర్ లొంగి పోయాడు.
పూర్ణచందర్ చాలా దుర్మార్గుడు, అమ్మాయిల పిచ్చోడు: స్వేచ్ఛ తండ్రి
ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు
నా మనవరాలిని సైతం వేధించాడు
తల్లి స్వేచ్ఛతో కూడా చెప్పుకోలేకపోయింది
– స్వేచ్ఛ తండ్రి pic.twitter.com/7zx935rd9o
— BIG TV Breaking News (@bigtvtelugu) June 29, 2025